Wednesday, 23 September 2026
  • Home  
  • రామాపురంలో పల్లె పండుగ–3.0 ఏర్పాట్ల పరిశీలన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రామాపురంలో పల్లె పండుగ–3.0 ఏర్పాట్ల పరిశీలన

వరికుంటపాడు మండలం రామాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ నెల 29న నిర్వహించనున్న పల్లె పండుగ–3.0 కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన వెంకట సత్యనారాయణ రాజు, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, కూటమి నాయకులతో కలిసి సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతం, హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. హెలిప్యాడ్ వద్ద భద్రతా ప్రమాణాలు పాటించాలని, అవసరమైన మౌలిక వసతులు ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమం సజావుగా విజయవంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.