Saturday, 26 September 2026
  • Home  
  • వర్షం వస్తే రాకపోకలు బంద్..నాలుగు గిరిజన గ్రామాల ప్రజలకు తప్పని ఇబ్బందులు
- అల్లూరి సీతారామరాజు

వర్షం వస్తే రాకపోకలు బంద్..నాలుగు గిరిజన గ్రామాల ప్రజలకు తప్పని ఇబ్బందులు

అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలోని తీగలమాడ, చట్టాలగరువు,పనసమాన వలస, లక్ష్మీపురం గిరిజన గ్రామాల ప్రజలకు వర్షాకాలంలో రాకపోకలు తీవ్ర ఇబ్బందిగా మారుతున్నాయి.నిత్యావసర వస్తువులు, వైద్య సేవలు తదితర అవసరాల కోసం గ్రామస్తులు శివలింగపురం వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. గ్రామాల మధ్య రాకపోకలకు కీలకంగా ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం గతంలో గొయ్యిలు తవ్వి పనులు ప్రారంభించినప్పటికీ, అనంతరం పనులు నిలిచిపోయాయని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రస్తుతం తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాగులో వరద ఉధృతి పెరిగి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు కురిసిన సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు మరింత అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి, నాలుగు గ్రామాలకు శాశ్వత రాకపోకల సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు పాంగి పోయు, ఒలం పోతురాజు తదితరులు డిమాండ్ చేశారు. Uploaded Video:

అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలోని తీగలమాడ, చట్టాలగరువు,పనసమాన వలస, లక్ష్మీపురం గిరిజన గ్రామాల ప్రజలకు వర్షాకాలంలో రాకపోకలు తీవ్ర ఇబ్బందిగా మారుతున్నాయి.నిత్యావసర వస్తువులు, వైద్య సేవలు తదితర అవసరాల కోసం గ్రామస్తులు శివలింగపురం వెళ్లాల్సి వస్తుందని తెలిపారు.
గ్రామాల మధ్య రాకపోకలకు కీలకంగా ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం గతంలో గొయ్యిలు తవ్వి పనులు ప్రారంభించినప్పటికీ, అనంతరం పనులు నిలిచిపోయాయని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రస్తుతం తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాగులో వరద ఉధృతి పెరిగి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

వర్షాలు కురిసిన సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు మరింత అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి, నాలుగు గ్రామాలకు శాశ్వత రాకపోకల సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు పాంగి పోయు, ఒలం పోతురాజు తదితరులు డిమాండ్ చేశారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.