🪔 భక్తి వెలుగుల్లో 24 కాలనీ వినాయక మహోత్సవం!
విశాఖపట్నం జిల్లా,ఆనందపురం (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 22 ::
ఆనందపురం గ్రామం 24 కాలనీలో వినాయక చవితి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువత, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు.
ప్రతి సంవత్సరం వినాయక మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతున్న కమిటీ సభ్యుల కృషి అభినందనీయం. పండుగను అందరి భాగస్వామ్యంతో నిర్వహిస్తూ కాలనీలో భక్తి, ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించేందుకు కమిటీ చేస్తున్న కృషి ప్రశంసలు అందుకుంటోంది.
ఈ ఏడాది కూడా దీపారాధన వంటి కార్యక్రమాలతో భక్తి వెలుగులు పంచుతూ.. ప్రజల మధ్య ఐక్యతను చాటుతూ.. యువతలో సేవా స్ఫూర్తిని నింపుతూ కమిటీ సభ్యులు ముందుకు సాగుతున్నారు.
ఏటా సంప్రదాయం.. నిరంతర సేవ.. భక్తితో కూడిన ఐక్యత — 24 కాలనీ వినాయక మహోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.






