Tuesday, 29 September 2026
  • Home  
  • బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎం.ఏ. లతీఫ్‌కే అవకాశం ఇవ్వాలి
- నిర్మల్

బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎం.ఏ. లతీఫ్‌కే అవకాశం ఇవ్వాలి

పార్టీ కోసం ఏళ్లుగా పనిచేసిన సీనియర్ నేతకు గుర్తింపు ఇవ్వాలి: సేవాదళ్ నాయకులు బైంసా: బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఖాళీ కానున్న నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మంచిర్యాల జిల్లా పరిశీలకుడు ఎం.ఏ. లతీఫ్‌కు అవకాశం కల్పించాలని ముధోల్ నియోజకవర్గ సేవాదళ్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బైంసాలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆత్మారాం, బైంసా మండల అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా లతీఫ్ చేసిన సేవలను గుర్తించాలని కోరారు. కరోనా సమయంలోనూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, 2023లో పలువురు నాయకులు పార్టీని వీడినప్పటికీ కాంగ్రెస్‌ను వీడకుండా పార్టీ జెండాను మోస్తూ ప్రజల్లో పనిచేశారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన వారితో పాటు, దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్‌ను కోరారు. ఎం.ఏ. లతీఫ్‌కు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అవకాశం కల్పిస్తే ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అవకాశం కల్పించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు, ధర్నాలు చేపడతామని సేవాదళ్ నాయకులు హెచ్చరించారు.

పార్టీ కోసం ఏళ్లుగా పనిచేసిన సీనియర్ నేతకు గుర్తింపు ఇవ్వాలి: సేవాదళ్ నాయకులు
బైంసా: బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఖాళీ కానున్న నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మంచిర్యాల జిల్లా పరిశీలకుడు ఎం.ఏ. లతీఫ్‌కు అవకాశం కల్పించాలని ముధోల్ నియోజకవర్గ సేవాదళ్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బైంసాలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆత్మారాం, బైంసా మండల అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా లతీఫ్ చేసిన సేవలను గుర్తించాలని కోరారు.
కరోనా సమయంలోనూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, 2023లో పలువురు నాయకులు పార్టీని వీడినప్పటికీ కాంగ్రెస్‌ను వీడకుండా పార్టీ జెండాను మోస్తూ ప్రజల్లో పనిచేశారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన వారితో పాటు, దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్‌ను కోరారు.
ఎం.ఏ. లతీఫ్‌కు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అవకాశం కల్పిస్తే ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అవకాశం కల్పించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు, ధర్నాలు చేపడతామని సేవాదళ్ నాయకులు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.