Saturday, 26 September 2026
  • Home  
  • బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి
- కడప

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి పున్నమి ప్రతినిధి – కడప, సెప్టెంబర్ 25: కడప జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు అధికారులు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో బాల్య వివాహాల నిరోధానికి కృషి చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు, యువత, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, బాలికల విద్యను కొనసాగించడం ద్వారా వారి భవిష్యత్తుకు మంచి అవకాశాలు కల్పించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా బాల్య వివాహాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. బాల్య వివాహాలను అరికట్టడంలో గ్రామస్థాయి అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు. 2024 నుంచి పాఠశాలలు, పంచాయతీలు, 50 గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సుమారు 1,500 కుటుంబాలకు ఇంటింటి ప్రచారం ద్వారా అవగాహన కల్పించారు. అలాగే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా 73,074 మంది ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాల ముప్పు ఉన్న 5,801 కుటుంబాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేసి, వారికి అవసరమైన సహాయాన్ని అందించే చర్యలు చేపట్టారు. అదేవిధంగా బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 61 బాల్య వివాహాలను గుర్తించి అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో బాల్య వివాహాలను నిరోధిస్తూ, బాలికలకు విద్య, సంక్షేమం, భద్రత కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో జిల్లాలో 500 గ్రామాలను బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చారు.

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి

పున్నమి ప్రతినిధి – కడప, సెప్టెంబర్ 25: కడప జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు అధికారులు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో బాల్య వివాహాల నిరోధానికి కృషి చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు, యువత, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, బాలికల విద్యను కొనసాగించడం ద్వారా వారి భవిష్యత్తుకు మంచి అవకాశాలు కల్పించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

ఈ కార్యక్రమాల్లో భాగంగా బాల్య వివాహాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. బాల్య వివాహాలను అరికట్టడంలో గ్రామస్థాయి అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు.

2024 నుంచి పాఠశాలలు, పంచాయతీలు, 50 గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సుమారు 1,500 కుటుంబాలకు ఇంటింటి ప్రచారం ద్వారా అవగాహన కల్పించారు. అలాగే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా 73,074 మంది ప్రతిజ్ఞ చేశారు.

బాల్య వివాహాల ముప్పు ఉన్న 5,801 కుటుంబాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేసి, వారికి అవసరమైన సహాయాన్ని అందించే చర్యలు చేపట్టారు. అదేవిధంగా బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

ఇప్పటివరకు 61 బాల్య వివాహాలను గుర్తించి అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో బాల్య వివాహాలను నిరోధిస్తూ, బాలికలకు విద్య, సంక్షేమం, భద్రత కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.

రానున్న రోజుల్లో జిల్లాలో 500 గ్రామాలను బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.