డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి గన్నవరం నియోజకవర్గం : సెప్టెంబర్ 20 – 2026 :
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై తాజాగా వెలువడిన దర్యాప్తు వివరాలతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని పి.గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు అన్నారు. ED దర్యాప్తులో జంతు కొవ్వు కలవలేదు, కల్తీ చేసిన నెయ్యి సరఫరా జరగలేదు అని ED దర్యాప్తులో వెల్లడైంది.
జగన్ గారిని రాజకీయంగా దెబ్బతీయాలని పవిత్రమైన లడ్డూ పై విషం చిమ్మిన హిందూ ద్రోహులు కూటమి ప్రభుత్వం అని గన్నవరపు శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా ఆరోపణలు చేయడం సరికాదని గన్నవరపు శ్రీనివాసరావు అన్నారు.
పుకార్లు ఎంతకాలం కొనసాగినా నిజం చివరికి బయటపడుతుందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించారని గన్నవరపు శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భక్తకోటికి ఎప్పుడు క్షమాపణ చెబుతారో సమాధానం చెప్పాలని గన్నవరపు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
“పుకార్లు ఎంత దూరం పరిగెత్తినా, నిజం చివరికి వెలుగులోకి వస్తుంది. కాలం వాస్తవాలకు సాక్ష్యంగా నిలుస్తుంది” అని గన్నవరపు శ్రీనివాసరావు అన్నారు. భక్తుల విశ్వాసాలను కాపాడేలా ఈ అంశంపై పారదర్శకంగా నిజాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.


