Wednesday, 30 September 2026
  • Home  
  • నెల్లూరు సిటీలో ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీలకు అవగాహన సమావేశం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు సిటీలో ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీలకు అవగాహన సమావేశం

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గం 117 పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నామని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వై.ఓ నందన్ తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయం కమిషనర్ ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ.ఆర్.ఓ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) రెండవ దశ నిర్వహణపై అవగాహన సమావేశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్త ఓటర్లను గుర్తించడంలో, ఓటరు నమోదు చేయించడంలో, తప్పులు లేని సమగ్రమైన తుది ఓటరు జాబితాను రూపొందించడంలో స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.ఎల్.ఓ లకు సహకరించాలని ఈ.ఆర్.ఓ సూచించారు. ఈ సమావేశంలో నెల్లూరు నగర నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులు జనసేన – శ్రీకాంత్, టిడిపి – అజయ్ కుమార్, కాంగ్రెస్ – సంజయ్ కుమార్, బిజెపి – హర్షవర్ధన్, వైఎస్సార్ సిపి – అర్షిత్ రెడ్డి, ఏ.ఈ.ఆర్.ఓ డి.వి లక్ష్మీ, డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్, నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గం 117 పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నామని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వై.ఓ నందన్ తెలిపారు.

కార్పొరేషన్ కార్యాలయం కమిషనర్ ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈ.ఆర్.ఓ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) రెండవ దశ నిర్వహణపై అవగాహన సమావేశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

కొత్త ఓటర్లను గుర్తించడంలో, ఓటరు నమోదు చేయించడంలో, తప్పులు లేని సమగ్రమైన తుది ఓటరు జాబితాను రూపొందించడంలో స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.ఎల్.ఓ లకు సహకరించాలని ఈ.ఆర్.ఓ సూచించారు.

ఈ సమావేశంలో నెల్లూరు నగర నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులు జనసేన – శ్రీకాంత్, టిడిపి – అజయ్ కుమార్, కాంగ్రెస్ – సంజయ్ కుమార్, బిజెపి – హర్షవర్ధన్, వైఎస్సార్ సిపి – అర్షిత్ రెడ్డి, ఏ.ఈ.ఆర్.ఓ డి.వి లక్ష్మీ, డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్, నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.