Sunday, 5 July 2026
  • Home  
  • నాగలాపురంలో బెల్ట్ షాపులపై పోలీసుల మెరుపు దాడులు ……ఇద్దరు అరెస్ట్ – 22 మద్యం సీసాలు స్వాధీనం
- ఆంధ్రప్రదేశ్

నాగలాపురంలో బెల్ట్ షాపులపై పోలీసుల మెరుపు దాడులు ……ఇద్దరు అరెస్ట్ – 22 మద్యం సీసాలు స్వాధీనం

✒️తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పుత్తూరు సబ్‌డివిజన్ పోలీసు అధికారి, సత్యవేడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో నాగలాపురం ఎస్‌ఐ పి. సునీల్ ఆధ్వర్యంలో శనివారం బెల్ట్ షాపులపై మెరుపు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌.ఎస్‌.పురం హరిజనవాడలో వట్టి మారయ్య (65)ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 14 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే జంబుకేశ్వరపురం ఎస్‌.టి. కాలనీలో కె. చంద్రారెడ్డి (67)ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 8 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 22 క్వార్టర్ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

✒️తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పుత్తూరు సబ్‌డివిజన్ పోలీసు అధికారి, సత్యవేడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో నాగలాపురం ఎస్‌ఐ పి. సునీల్ ఆధ్వర్యంలో శనివారం బెల్ట్ షాపులపై మెరుపు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

ఎస్‌.ఎస్‌.పురం హరిజనవాడలో వట్టి మారయ్య (65)ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 14 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే జంబుకేశ్వరపురం ఎస్‌.టి. కాలనీలో కె. చంద్రారెడ్డి (67)ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 8 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 22 క్వార్టర్ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.