దమ్మాయిగూడ (మేడ్చల్):
మత సామరస్యానికి ప్రతీకగా దమ్మాయిగూడ ఓల్డ్ విలేజ్, పీర్ల కొట్టం బొడ్డు రాయి వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణేష్ ప్రసాదం లడ్డూ వేలం పాట ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో ముస్లిం సోదరులైన అక్బర్, ఎస్.కె. మొసీమ్ పోటాపోటీగా పాల్గొన్నారు. చివరికి ఎస్.కె. మొసీమ్ రూ. 40,000 కు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు.
ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ 18వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీహరి గౌడ్ పాల్గొని విజేతను అభినందించారు. గణేష్ ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావడం ఇక్కడి సమైక్యతకు నిదర్శనమని నిర్వాహకులు పేర్కొన్నారు.
– సందీప్, పున్నమి విలేకరి (మేడ్చల్ జిల్లా)

దమ్మాయిగూడ గణేష్ లడ్డూ వేలంలో ముస్లిం సోదరుల సమైక్యత – ₹40 వేలకు దక్కించుకున్న ఎస్.కె. మొసీమ్
దమ్మాయిగూడ (మేడ్చల్): మత సామరస్యానికి ప్రతీకగా దమ్మాయిగూడ ఓల్డ్ విలేజ్, పీర్ల కొట్టం బొడ్డు రాయి వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణేష్ ప్రసాదం లడ్డూ వేలం పాట ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో ముస్లిం సోదరులైన అక్బర్, ఎస్.కె. మొసీమ్ పోటాపోటీగా పాల్గొన్నారు. చివరికి ఎస్.కె. మొసీమ్ రూ. 40,000 కు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ 18వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీహరి గౌడ్ పాల్గొని విజేతను అభినందించారు. గణేష్ ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావడం ఇక్కడి సమైక్యతకు నిదర్శనమని నిర్వాహకులు పేర్కొన్నారు. – సందీప్, పున్నమి విలేకరి (మేడ్చల్ జిల్లా)

