దుత్తలూరు మండలంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శ్లోక వ్రాత పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. త్రిమత ఏకైక గురువు శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల దివ్య ఆశీస్సులతో కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. నర్రవాడ ZPPHS పాఠశాలలో పదో తరగతి చదువుతున్న B. సౌజన్య స్కూలు స్థాయిలో మొదటి శ్రేణిలో అత్యధిక మార్కులు సాధించింది. ఆమెకు పాఠశాల ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథాన్ని బహుమతిగా అందజేశారు. అలాగే నందిపాడు ZPPHSలో ఎనిమిదో తరగతి చదువుతున్న R. సాహితి అత్యధిక మార్కులు సాధించడంతో ఆమెకు కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథాన్ని అందించారు. విద్యార్థులు ఆధ్యాత్మిక విలువలు, నైతికతను అలవర్చుకోవాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. విద్యార్థులను అభినందించారు.



