ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 20 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో “చాయ్ విత్ జనసైనిక్స్” కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల జనసేన నాయకులు పెనుబాక ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, రానున్న MPTC, ZPTC, పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. మండలంలోని 19 పంచాయతీలను వారానికి ఒకటి చొప్పున సందర్శించి, పంచాయతీ అధికారులను కలిసి స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు పిడూరు పంచాయతీని సందర్శించనున్నట్లు ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రామ సమస్యల పరిష్కారానికి జనసేన కార్యాచరణ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 20 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో “చాయ్ విత్ జనసైనిక్స్” కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల జనసేన నాయకులు పెనుబాక ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, రానున్న MPTC, ZPTC, పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. మండలంలోని 19 పంచాయతీలను వారానికి ఒకటి చొప్పున సందర్శించి, పంచాయతీ అధికారులను కలిసి స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు పిడూరు పంచాయతీని సందర్శించనున్నట్లు ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

