*గణేష్ భక్తులు అన్నదానం కార్యక్రమం*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 24 వాకాడు మండలం,*
వాకాడులో ఉన్న ఈ చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద స్థానికులు గణేష్ విగ్రహాన్ని నెలకొల్పి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు పున్నేపల్లి వెంకట్, డాక్టర్ రాజేశ్వరి, బట్ట సునీల్ ,బట్ట కార్తీక్ అనే గణేష్ భక్తులు ఈరోజు మధ్యాహ్నం బారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసీపీ నాయకుడు,వాకాడు గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ పాపా రెడ్డి రాజశేఖర్ రెడ్డి పూజా కార్యక్రమాలు లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.



