కలిగిరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు అందించిన ఉప్మాలో పురుగులు కనిపించడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విద్యాలయానికి చేరుకుని సిబ్బందిని ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థినులకు తరచూ ఆహారంలో పురుగులు వస్తున్నాయని, వసతులు కూడా సక్రమంగా లేవని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకట సుబ్బయ్య గురువారం రాత్రి కేజీబీవీని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థినులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆహార నాణ్యత, వంటశాల పరిశుభ్రత, వసతులపై విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.

కలిగిరి కేజీబీవీలో అల్పాహారంలో పురుగులు