చిట్వేలి: మండల కేంద్రమైన చిట్వేలి అంబేద్కర్ సర్కిల్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. డీటీఆర్ కింద కేబుల్ మార్పిడి పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కేబుల్ మార్పిడి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ సర్కిల్ పరిధిలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. పనులు పూర్తయిన అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖ సిబ్బందికి ప్రజలు సహకరించాలని చిట్వేలి విద్యుత్ శాఖ ఏఈ బాలకృష్ణ కోరారు.

అంబేద్కర్ సర్కిల్లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం