ఖమ్మం ఆగష్టు 12
(పున్నమి ప్రతినిధి)
హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా ఈ నెల 13వ తేదీ గురువారం నిర్వహించనున్న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీరామనేని మణి పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు ఖమ్మం పేవిలియన్ గ్రౌండ్ నుంచి ర్యాలీ ప్రారంభమై జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుందని తెలిపారు. దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటే ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


