ఖానాపూర్, పున్నమి ప్రతినిధి: హనుమకొండలో రేపు నిర్వహించనున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని స్వేరో నాయకులు కోరారు.
ఈ సందర్భంగా ఖానాపూర్ మండలం కొత్తూరు గ్రామంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెర్రిపోతుల అజయ్ కుమార్, 3వ వార్డు నంబర్ జెర్రిపోతుల వెంకటేశ్వర్లు, మేడిపల్లి శంకర్, రెడ్డిమల్ల రాకేష్, జాటోతు రమేష్, సదర్ లాల్, యాకయ్య, మహేష్, సాంబరాజు, సారయ్య, రాజు, మల్లయ్య, చంద్రమౌళి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
స్వేరో భావజాలం, విద్యా చైతన్యం, సామాజిక సమానత్వం లక్ష్యంగా నిర్వహించే ఈ ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
