ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్ )
సూర్యాపేట: సూర్యాపేట–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై శనివారం నుంచి వాహనాల రాకపోకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ హైవే అందుబాటులోకి రావడంతో హైదరాబాద్–ఖమ్మం–విజయవాడ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా మరింత సులభతరం కానుంది. ఆధునిక ప్రమాణాలతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గి, వేగవంతమైన ప్రయాణానికి అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఈ రహదారి ప్రారంభంతో పరిసర ప్రాంతాల ఆర్థిక, వాణిజ్య అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.



