సీబీఎస్ఈ ఆన్‌స్క్రీన్ మూల్యాంకన వ్యవస్థ టెండర్ కేటాయింపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నలు లేవనెత్తారు. టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థను పక్కనపెట్టి మరో సంస్థకు టెండర్ ఇవ్వడానికి నిబంధనలు సడలించారని ఆరోపించారు.
మూల్యాంకన ప్రక్రియలో పలు సాంకేతిక లోపాలు, స్కాన్ చేసిన జవాబు పత్రాల్లో తప్పులు ఉన్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.


