పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకవర్గ అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ హాజరై మాట్లాడారు సొసైటీ పరిధిలో ని 22 గ్రామాలు వేములవాడ రూరల్ మండలానికి చెందిన 17 గ్రామాలు అదనంగా మరో నాలుగు గ్రామాలను కలుపుకొని ఏర్పాటు చేసిన ఈ సింగిల్ విండో కు ఎంపికైన చైర్మన్ పాలకవర్గ సభ్యులపై గురుతరమైన బాధ్యత ఉందని ఆయన తెలిపారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు నిరంతరం సేవలందిస్తూ ప్రభుత్వానికి రైతులకు మధ్య ఒక వారధిలా పనిచేసే మంచి పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు సింగిల్ విండో చైర్మన్ సభ్యులు కలిసి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు
