స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెరువు కట్ట మట్టిని భారీగా రోడ్డుపైకి పెంచడం వల్ల ప్రమాదకరమైన బ్లైండ్ టర్నింగ్ ఏర్పడింది. కట్ట ఎత్తుగా ఉండటం మరియు మట్టి రోడ్డు మీదకు రావడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పదే పదే ప్రమాదాలు జరుగుతున్నాయి. నేడు ఇదే ప్రాంతంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించి ప్రమాదాలు నివారించాలని స్థానికులు వేడుకుంటున్నారు.

సముద్రాలలో రోడ్డుపై మట్టికట్టతో బ్లైండ్ టర్నింగ్ ప్రమాదం: ఇద్దరికి తీవ్ర గాయాలు