తిరుమల, అక్టోబర్ 08 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సుమారు రూ.25 లక్షల విలువైన రెండు బంగారు పగడాల హారాలు విరాళంగా అందాయి. హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు శ్రీమతి కమల గురువారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ఈ కానుకలను సమర్పించారు.
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాత శ్రీమతి కమల తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆభరణాలను టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరికి లాంఛనంగా అందజేశారు. అనంతరం వేద పండితులు దాత కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు.తిరుమల రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరికి బంగారు పగడాల హారాలను అందజేస్తున్న దాత శ్రీమతి కమల, కుటుంబ సభ్యులు.

