వ్యవసాయ, అనుబంధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా 90 రైతుబజార్లను ఏర్పాటు చేయనున్నారు. మత్స్యకారుల కోసం రూ.240 కోట్లతో 200 మరపడవలను అందించనున్నారు. మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ జులైలో శంకుస్థాపన కానుంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద కోకోసిటీ ఏర్పాటును పరిశీలిస్తున్నారు. పులివెందుల ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌కు రూ.3 కోట్లు విడుదలయ్యాయి. ఆక్వా విద్యుత్ రాయితీ కింద 12,680 కనెక్షన్లకు అదనంగా రూ.188 కోట్లతో కలిపి మొత్తం రూ.1,100 కోట్లు ప్రభుత్వం భరిస్తోంది. అలాగే, ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేస్తూ రైతులకు నష్టం కలగకుండా ముందస్తు ప్రణాళికలు, ప్రకృతి సేద్యంపై అవగాహన, పంటలకు కనీస మద్దతు ధర అందించాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయ, అనుబంధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు గారు