Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

వైరా మార్కెట్‌లో పెసలు, వడ్ల కొనుగోలు కేంద్రాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వైరా మార్కెట్‌లో పెసలు, వడ్ల కొనుగోలు కేంద్రాలు

5న ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ చేతుల మీదుగా ప్రారంభం

వైరా, అక్టోబర్ 4: రైతులకు మద్దతు ధర కల్పించే లక్ష్యంతో వైరా వ్యవసాయ మార్కెట్‌లో ఈ నెల 5న పెసలు, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు తెలిపారు.

వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ చేతుల మీదుగా కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని బోళ్ళ గంగారావు కోరారు. రైతులకు సంక్షేమం, మద్దతు ధర అందించేందుకు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపు సుధాకర్, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొంటారు.

వైరా మార్కెట్‌లో పెసలు, వడ్ల కొనుగోలు కేంద్రాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *