వార్త ముఖ్యాంశాలు
- 216 మందికి రూ.1.02 కోట్ల ఆర్థిక సాయం ఖమ్మం, అక్టోబర్ 4: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
- ఆదివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
- ఖమ్మం రూరల్ మండలంలో 51 మందికి రూ.50.05 లక్షల కల్యాణలక్ష్మి చెక్కులు, ఏదులాపురం మున్సిపాలిటీలో 70 మందికి రూ.23.66 లక్షలు, ఖమ్మం రూరల్ మండలంలో 95 మందికి రూ.28.79 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు.
216 మందికి రూ.1.02 కోట్ల ఆర్థిక సాయం
ఖమ్మం, అక్టోబర్ 4: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఖమ్మం రూరల్ మండలంలో 51 మందికి రూ.50.05 లక్షల కల్యాణలక్ష్మి చెక్కులు, ఏదులాపురం మున్సిపాలిటీలో 70 మందికి రూ.23.66 లక్షలు, ఖమ్మం రూరల్ మండలంలో 95 మందికి రూ.28.79 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. మొత్తం 216 మంది లబ్ధిదారులకు రూ.1.02 కోట్లకుపైగా ఆర్థిక సాయం అందింది.
సీఎంఆర్‌ఎఫ్ పథకం ద్వారా అత్యవసర వైద్య చికిత్స పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వంగా సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి, కాంగ్రెస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు తోట వీరభద్రం, ఏదులాపురం మున్సిపాలిటీ అధ్యక్షుడు బానోత్ కిషోర్ నాయక్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.