వార్త ముఖ్యాంశాలు
- వింజమూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
- చిన్నచిన్న సమస్యలను పక్కనపెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.
- వింజమూరు జడ్పీటీసీ అభ్యర్థిగా పల్లాల కొండారెడ్డి, ఎంపీపీ అభ్యర్థిగా గణపం బాలకృష్ణారెడ్డిని ప్రకటించారు.
వింజమూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. చిన్నచిన్న సమస్యలను పక్కనపెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. వింజమూరు జడ్పీటీసీ అభ్యర్థిగా పల్లాల కొండారెడ్డి, ఎంపీపీ అభ్యర్థిగా గణపం బాలకృష్ణారెడ్డిని ప్రకటించారు. అభ్యర్థులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, తాను అన్నివిధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలని కోరారు. వింజమూరులోని వీఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పలు గ్రామాలకు చెందిన కూటమి నాయకులు మేకపాటి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.