*వెల్లడం గ్రామ సర్పంచ్ టిడిపి అభ్యర్థిగా వేమిరెడ్డి శ్రీనిజా రెడ్డి*
* మైలవరం/ ఎన్టీఆర్ జిల్లా/ నవంబర్ 14*
మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఆశీస్సులతో పెద్దలు గ్రామ టిడిపి పార్టీ నాయకులు కోమటి సుధాకర్ రావు ఆధ్వర్యంలో
వెల్లడం గ్రామంలో కూటమి తరఫున సర్పంచ్ అభ్యర్థిగా వేమిరెడ్డి శ్రీనిజా రెడ్డి పోటీ చేస్తున్నారు. దివంగత వేమిరెడ్డి కృష్ణారెడ్డి కోడలిగా గ్రామ ప్రజలకు పరిచయమున్న ఆమెకు కూటమి నాయకులు, కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు.
గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచిన శ్రీనిజా రెడ్డి కి ప్రజల ఆదరణ లభించాలని కూటమి శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థి శ్రీనిజా రెడ్డి
వెల్లడం: గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థి వేమిరెడ్డి శ్రీనిజా రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, తాగునీటి సమస్యను పరిష్కరించడం, విద్యుత్ సమస్యలపై దృష్టి సారించడం, ప్రతి వీధిలో వీధి దీపాలు ఏర్పాటు చేయడం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ, పరిశుభ్రమైన వాతావరణం, సురక్షితమైన తాగునీరు, వెలుగులతో నిండిన వీధులు ఉండేలా కృషి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

