*ఎన్టీఆర్ జిల్లా మైలవరం..*
*మైలవరం సర్పంచ్ అభ్యర్థిగా ఎస్.వి.ఎన్. నివృతరావు గారు.*
*ఎన్నికల ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు.*
*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,* *14/11/2026.*
*మైలవరం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్.వి.ఎన్. నివృతరావు గారికి మద్దతుగా రూపొందించిన ఎన్నికల ప్రచార పోస్టర్లను మైలవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శనివారం ఆవిష్కరించారు.*
*ఈ సందర్భంగా అభ్యర్థి ఎస్.వి.ఎన్. నివృతరావు గారికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో విజయాన్ని సాధించే లక్ష్యంతో పార్టీ శ్రేణులు, కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమవుతూ అభ్యర్థి తరఫున కృషి చేయాలని తెలిపారు.*
*ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయాలని, కూటమి కుటుంబ సభ్యులందరూ సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు సూచించారు. అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు, కూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.*

