Sunday, 13 September 2026
  • Home  
  • వినాయక విగ్రహాల ఏర్పాటుకు 80 శాతం అనుమతులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వినాయక విగ్రహాల ఏర్పాటుకు 80 శాతం అనుమతులు

వినాయక విగ్రహాల ఏర్పాటుకు 80 శాతం అనుమతులు ఆత్మకూరు పోలీస్ డివిజన్ పరిధిలో వినాయక చవితి వేడుకల సందర్భంగా విగ్రహాల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులపై పోలీసులు చర్యలు చేపట్టారు. డివిజన్ పరిధిలోని 9 మండలాలు, 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు 818 దరఖాస్తులు అందినట్లు ఆత్మకూరు డీఎస్పీ టి.వెంకటేశ్వర్లు తెలిపారు. స్టేషన్ల వారీగా దరఖాస్తులను పరిశీలించి, సుమారు 80 శాతం అనుమతులు ఇప్పటికే మంజూరు చేసినట్లు వెల్లడించారు. మిగిలిన దరఖాస్తులకు కూడా ఆదివారం అనుమతులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. అనుమతులు పొందిన నిర్వాహకులు పోలీసుల సూచనలు, ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ వినాయక వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని డీఎస్పీ సూచించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

వినాయక విగ్రహాల ఏర్పాటుకు 80 శాతం అనుమతులు

ఆత్మకూరు పోలీస్ డివిజన్ పరిధిలో వినాయక చవితి వేడుకల సందర్భంగా విగ్రహాల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులపై పోలీసులు చర్యలు చేపట్టారు. డివిజన్ పరిధిలోని 9 మండలాలు, 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు 818 దరఖాస్తులు అందినట్లు ఆత్మకూరు డీఎస్పీ టి.వెంకటేశ్వర్లు తెలిపారు. స్టేషన్ల వారీగా దరఖాస్తులను పరిశీలించి, సుమారు 80 శాతం అనుమతులు ఇప్పటికే మంజూరు చేసినట్లు వెల్లడించారు. మిగిలిన దరఖాస్తులకు కూడా ఆదివారం అనుమతులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. అనుమతులు పొందిన నిర్వాహకులు పోలీసుల సూచనలు, ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ వినాయక వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని డీఎస్పీ సూచించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.