Tuesday, 15 September 2026
  • Home  
  • వినాయక మండపాలలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వినాయక మండపాలలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష నగరంలోని వివిధ వినాయక మండపాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండపాల నిర్వాహకులు, భక్తులతో మాట్లాడి భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు తెలిపారు. పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో నగర పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.