వార్త ముఖ్యాంశాలు
- గాజువాక, సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి) జీవీఎంసీ 87వ వార్డు పరిధిలోని కణితి కాలనీ ఏకలవ్య వీధిలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఏకలవ్య యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, కమిటీ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరై…
- అనంతరం అన్న సమారాధనను ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.
- కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏకలవ్య యూత్ సభ్యులు వినాయక చవితి మహోత్సవాలను నిర్వహించడంతో పాటు అన్న సమారాధన చేపట్టడం అభినందనీయమని, భక్తులకు సేవ చేయడం గొప్ప కార్యక్రమమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా సెక్రటరీ ప్రగడ వేణుబాబు, రాష్ట్ర బీసీ సెల్…
గాజువాక, సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి)
జీవీఎంసీ 87వ వార్డు పరిధిలోని కణితి కాలనీ ఏకలవ్య వీధిలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఏకలవ్య యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, కమిటీ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరై వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏకలవ్య యూత్ సభ్యులు వినాయక చవితి మహోత్సవాలను నిర్వహించడంతో పాటు అన్న సమారాధన చేపట్టడం అభినందనీయమని, భక్తులకు సేవ చేయడం గొప్ప కార్యక్రమమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా సెక్రటరీ ప్రగడ వేణుబాబు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎన్ఐటి రమణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇల్లపు రాము, జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ ముద్దపు దామోదర్, దుగ్గపు దానప్పలు, బొండా గోవిందరాజు, అప్పిని సన్యాసిరావు, సబ్బవరం ఈశ్వరరావు, కే. పారేపల్లి, ప్రగడ రాము, ఎస్. పాపారావు, దాసరి అప్పారావు, దాసరి అప్పుడు, ఏకలవ్య యూత్ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.