వార్త ముఖ్యాంశాలు
- వింజమూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వింజమూరు మండల ఎంపీపీ అభ్యర్థిగా గణపం బాలకృష్ణారెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థిగా పల్లాల కొండారెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్రెడ్డి ప్రకటించారు.
- పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.
- రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వింజమూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వింజమూరు మండల ఎంపీపీ అభ్యర్థిగా గణపం బాలకృష్ణారెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థిగా పల్లాల కొండారెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్రెడ్డి ప్రకటించారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, నందిగుంటకు చెందిన టీడీపీ నాయకులు చిలకల మల్లికార్జున్, మాల్యాద్రి వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.