వింజమూరు వీఆర్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వింజమూరు మండల విస్తృత స్థాయి నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, పరిశీలకులు కూనం సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని, అధైర్యపడవద్దని సూచించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2029లో జగనన్న ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇప్పటి నుంచే బలమైన పునాదులు వేయాలని కోరారు. సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

వింజమూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం.. భారీగా పాల్గొన్న పార్టీ శ్రేణులు