వార్త ముఖ్యాంశాలు
- కలిగిరి , పున్నమి ప్రతినిధి, నవంబర్ 5: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.ఈరోజు వింజమూరు పట్టణంలోని బిట్-6 (బీసీ కాలనీ) పరిధిలో గల జీబీకేఆర్ ఎస్టీ కాలనీ ఎంపీపీ…
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
- ప్రజల భవిష్యత్తు, ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఆలోచనాత్మకంగా ఓటు వేయాలని కోరారు.
కలిగిరి , పున్నమి ప్రతినిధి, నవంబర్ 5: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.ఈరోజు వింజమూరు పట్టణంలోని బిట్-6 (బీసీ కాలనీ) పరిధిలో గల జీబీకేఆర్ ఎస్టీ కాలనీ ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భవిష్యత్తు, ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఆలోచనాత్మకంగా ఓటు వేయాలని కోరారు. “మీ ఓటు – మీ హక్కు – మీ బాధ్యత” అని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేశారు.