Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరికుంటపాడులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వరికుంటపాడులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ

వార్త ముఖ్యాంశాలు

  • వరికుంటపాడు మండలంలో గురువారం స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది.
  • ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
  • ఈ నేపథ్యంలో ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు.

వరికుంటపాడు మండలంలో గురువారం స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ, అధికారుల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *