వార్త ముఖ్యాంశాలు
- రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు ఇక్కట్లు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పున్నమి ప్రతినిధి కొయ్యలగూడెం, కన్నాపురం గ్రామంలో గల సర్వీస్ హోమ్ నందు గత వైసిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో గృహాలు ఇళ్ల స్థలాలు ఇచ్చారు గృహాలు బానే…
- అధికారులు త్వరితగతిన స్పందించి మాకు న్యాయం చేయాలని అక్కడ నివసిస్తున్న ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు ఎన్ని పర్యాయాలు అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన మా పరిస్థితి ఇలానే ఉందని అక్కడున్న ప్రజలు వాపోతున్నారు డ్రైనేజీలు లేవు రోడ్లు లేక ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇకనైనా అధికారులు స్పందించి…
- పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి
రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు ఇక్కట్లు
ఏలూరు జిల్లా
కొయ్యలగూడెం మండలం పున్నమి ప్రతినిధి
కొయ్యలగూడెం, కన్నాపురం గ్రామంలో గల సర్వీస్ హోమ్ నందు గత వైసిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో గృహాలు ఇళ్ల స్థలాలు ఇచ్చారు గృహాలు బానే ఉన్నాయి కానీ రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు ఎంతో నరకయాతన అనుభవిస్తున్నారు గృహాల్లో ఉపయోగించిన నీరు ఎటు వెళ్లడానికి లేక రోడ్ల మీదకి వచ్చి అక్కడ నిలిచిపోయిన పరిస్థితి అలానే వర్షపు నీరు కూడా రోడ్లమీద నిలిచిపోయి బురదమయముగా తయారైన పరిస్థితి ఆ బురదలోనే ఆ కంపుల్లోనే జనజీవనం కొనసాగిస్తున్నారు అందులో నుంచే ప్రయాణించవలసిన దుస్థితి ఏర్పడింది నీరు ఆ విధంగా ఆగిపోవడం వల్ల దోమలు ఈగలు భయంకరంగా వాటి మీద వాలి ఆ నీటిలోనే సంచరిస్తున్నాయి అవి మరల గృహాల్లోకి వచ్చి మనుషులను కొట్టడం వల్ల భోజన పదార్థాలు మీద ఈగలు వాడడం వల్ల ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు అలానే విషపూరితమైన పాములు తేళ్లు, జర్లు కూడా విషపూరితమైన వన్నీ కూడా ఇళ్లల్లోకి ప్రవేశించడం వల్ల ఇక నివసిస్తున్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు . అధికారులు త్వరితగతిన స్పందించి మాకు న్యాయం చేయాలని అక్కడ నివసిస్తున్న ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు ఎన్ని పర్యాయాలు అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన మా పరిస్థితి ఇలానే ఉందని అక్కడున్న ప్రజలు వాపోతున్నారు డ్రైనేజీలు లేవు రోడ్లు లేక ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇకనైనా అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని ప్రజాసంఘాలు నాయకులు అధికారులను వేడుకుంటున్నారు. పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి