*గ్రామ అభివృద్ధి జరగాలంటే – “కత్తెర” గుర్తుకు ఓటు వేయాలి..*
*మద్దుల పర్వ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పాలంకి కళ్యాణి గారి విజయమే లక్ష్యంగా గ్రామంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది.*
*రెడ్డిగూడెం మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి గారి సతీమణి, మద్దుల పర్వ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పాలంకి కళ్యాణి గారి గెలుపు కోసం గ్రామంలో ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది.*
*ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా కలుసుకుంటూ గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న పాలంకి కళ్యాణి గారికి “కత్తెర” గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.*
*అదేవిధంగా రెండవ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న కొప్పుల దావీదు గారికి “కుక్కర్” గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.*
*ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు కొప్పుల సునేత్రి గారితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.*
*గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నాయకత్వం అవసరమని, గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేసే నాయకత్వాన్ని ఆదరించాలని కోరారు.*
*గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రహదారులు, ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యతనిస్తూ మద్దుల పర్వ గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు పాలంకి కళ్యాణి గారికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.*
*మద్దుల పర్వ గ్రామ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామ అభివృద్ధి కోసం పాలంకి కళ్యాణి గారిని సర్పంచ్‌గా, రెండవ వార్డు సభ్యుడిగా కొప్పుల దావీదు గారిని గెలిపించాలని ప్రచారంలో అభ్యర్థించారు.*
*గ్రామ అభివృద్ధే లక్ష్యం… ప్రజా సంక్షేమమే ధ్యేయం…*
*సర్పంచ్ అభ్యర్థి పాలంకి కళ్యాణి గారికి – కత్తెర గుర్తు!*

