*ప్రజలతో మమేకం అవుతూ 2వ రోజు విస్తృత ప్రచారం…*
*రెడ్డిగూడెం మండలం మద్దుల పర్వ గ్రామం లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాలంకి కళ్యాణి గారి ప్రచార రెండో రోజు 3,4 వ వార్డు లో ఉత్సాహంగా కొనసాగింది.*
*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రెడ్డిగూడెం మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి గారు తన సతీమణి పాలంకి కళ్యాణి గారితో 3వ వార్డు,4వార్డు లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.*
*ప్రతి ఇంటికి వెళ్లి, పెద్దలను ఆప్యాయంగా పలకరిస్తూ, చిన్నలను ఆశీర్వదిస్తూ… ప్రజలతో మమేకమై, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ, నమస్కారాలతో ఓటు అభ్యర్థించారు.*
*తన హయాంలో గ్రామ అభివృద్ధి కోసం చేసిన కృషిని గుర్తుచేస్తూ, మళ్లీ ప్రజల సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా సాగించారు.*
*ఈ కార్యక్రమం లో ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి పాలంకి సురేష్ రెడ్డి గారు,మాజీ జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయలక్ష్మి గారు,గ్రామ పార్టీ అధ్యక్షులు పాలంకి రమణారెడ్డి గారు, మాజీ సర్పంచ్ కోమటి కృష్ణ గారు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..*

