వెల్వడం అభివృద్ధే లక్ష్యం.. గెలుపే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోట తిరుపతిరావు సతీమణి తిరుమల ప్రచారం!
సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. *ప్రభుత్వంతో సంబంధం లేకుండా* ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి స్థలాలు సమకూర్చి ఇళ్లు నిర్మించేలా కృషి చేస్తా లాక్కిరెడ్డి బాలిరెడ్డి, హనుమారెడ్డి కుటుంబ సభ్యుల బాటలో నడుస్తూ వారి ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా
మైలవరం: వెల్వడం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిరుమల గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి స్పష్టమైన హామీలతో ఓటర్ల ముందుకు వెళ్తున్నారు. సర్పంచ్‌గా తనకు ఒక్క అవకాశం కల్పిస్తే వెల్వడం గ్రామ రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు.
ముఖ్యంగా గ్రామంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తానని, ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా అవసరమైన స్థలాలను సమకూర్చి ఇళ్లు నిర్మించుకునేలా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇస్తున్నారు. గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం, అంతర్గత రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తానని వివరిస్తున్నారు. లక్కిరెడ్డి బాలిరెడ్డి, హనుమారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వెల్వడం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇస్తున్నారు.
గ్రామంలోని ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తానని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని తిరుమల పేర్కొంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చే హామీలను ఆచరణలో చూపించడమే తన లక్ష్యమని చెబుతూ, గ్రామ ప్రజల ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు కోరుతున్నారు. వెల్వడం అభివృద్ధికి తనకు ఒక అవకాశం కల్పించి సర్పంచ్‌గా గెలిపించాలని, విలువైన ఓటును తనకు వేసి విజయాన్ని అందించాలని ఇంటింటి ప్రచారంలో ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు.

