🙏 దేవుని సన్నిధిలో ఆశీర్వాదాల కోసం ప్రత్యేక ప్రార్థనలు… 🙏
ఈరోజు ఆదివారం సందర్భంగా రెడ్డిగూడెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న పలు చర్చిలలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కూడికల్లో రెడ్డిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి శ్రీమతి కొల్లు వాణి పలువురు వార్డుల అభ్యర్థులతో కలిసి
ఈ సందర్భంగా రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజాసేవ చేసే అవకాశం తమకు కలగాలని, తమ ప్రయత్నాలకు దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. అలాగే చర్చి పెద్దలు, పాస్టర్లు, క్రైస్తవ సోదర సోదరీమణులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులను మర్యాదపూర్వకంగా కలుసుకుని వారి ఆశీర్వాదాలు, సహకారం, మద్దతును కోరారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, అన్ని వర్గాల సమాన భాగస్వామ్యం, గ్రామంలో ఐక్యత మరియు సోదరభావం పెంపొందించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
దేవుని ఆశీస్సులతో పాటు పెద్దల ఆశీర్వాదాలు, గ్రామస్తుల సహకారం తమకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రార్థన కూడికల్లో పాల్గొని ఆధ్యాత్మిక పెద్దల ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
దేవుని ఆశీస్సులు… పెద్దల దీవెనలు… ప్రజల సహకారం… గ్రామ అభివృద్ధికి సమిష్టి కృషి…
🙏 ఈ ప్రార్థన కూడికలు అందరిలో ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షిద్దాం.
ఇంకా ఈ కార్యక్రమంలో…
రెడ్డిగూడెం మండల నూతన ఎంపీపీ ,
శ్రీ.ముప్పిడి. నాగేశ్వర్ రెడ్డి
రెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,శ్రీ.జనాలపాటి.వేణుగోపాల రెడ్డి,
ఎన్టీఆర్ జిల్లా,తెలుగు యువత ఉపాధ్యక్షులు,
శ్రీ.పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి,మరియు
గ్రామ పార్టీ ప్రెసిడెంట్ చాట్ల చందా
మద్దతుదారులు,కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

