వార్త ముఖ్యాంశాలు
- రూ.82 లక్షలతో పాతూరు చెరువు అభివృద్ధి పనులు వింజమూరు: పాతూరు చెరువు అభివృద్ధి పనులకు రూ.82 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేశారు.
- ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు వనిపెంట సుబ్బారెడ్డి మాట్లాడుతూ..
- చెరువును సమ్మర్ స్టోరేజ్‌గా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు.
రూ.82 లక్షలతో పాతూరు చెరువు అభివృద్ధి పనులు
వింజమూరు: పాతూరు చెరువు అభివృద్ధి పనులకు రూ.82 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు వనిపెంట సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చెరువును సమ్మర్ స్టోరేజ్‌గా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. ఎఫ్‌ఏఆర్ నిధుల కింద రూ.60 లక్షలు, అదనంగా రూ.23 లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు. సమ్మర్ స్టోరేజ్‌కు సంబంధించిన ఫైలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. చెరువు అభివృద్ధితో స్థానికులకు ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.