వార్త ముఖ్యాంశాలు
- వింజమూరు: బాట పేరుతో వ్యవసాయ భూముల ధ్వంసం!వింజమూరు: మండలంలోని నల్లారెడ్డిపల్లిలో బాట ఏర్పాటు పేరుతో తమ వ్యవసాయ భూములను ధ్వంసం చేశారని రైతులు ఆరోపించారు.
- తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, పొలాల్లో లేని సమయంలో రెవెన్యూ అధికారులు గుంతలు తవ్వి బాట ఏర్పాటు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
- సర్వే నంబర్ 328లో 2002లో నాలుగు ఎకరాలకు డి.
వింజమూరు: బాట పేరుతో వ్యవసాయ భూముల ధ్వంసం!వింజమూరు: మండలంలోని నల్లారెడ్డిపల్లిలో బాట ఏర్పాటు పేరుతో తమ వ్యవసాయ భూములను ధ్వంసం చేశారని రైతులు ఆరోపించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, పొలాల్లో లేని సమయంలో రెవెన్యూ అధికారులు గుంతలు తవ్వి బాట ఏర్పాటు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 328లో 2002లో నాలుగు ఎకరాలకు డి. పట్టా మంజూరైందని తెలిపారు. భూములకు సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉన్నప్పటికీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తమకు న్యాయం చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రైతులు కోరారు.