Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

రూ.4 కోట్లతో అయీనాపూర్ – సుగూర్ లింగంపల్లి రహదారి నిర్మాణానికి శ్రీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రూ.4 కోట్లతో అయీనాపూర్ – సుగూర్ లింగంపల్లి రహదారి నిర్మాణానికి శ్రీకారం

వార్త ముఖ్యాంశాలు

  • దశాబ్దాల ప్రజల ఎదురుచూపులకు తెర..
  • 4 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం!
  • దశాబ్దాలుగా సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అయీనాపూర్, సుగూర్ లింగంపల్లి గ్రామాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే దిశగా మరో ముందడుగు పడింది.

దశాబ్దాల ప్రజల ఎదురుచూపులకు తెర.. 4 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం!
దశాబ్దాలుగా సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అయీనాపూర్, సుగూర్ లింగంపల్లి గ్రామాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే దిశగా మరో ముందడుగు పడింది. రూ.4 కోట్ల భారీ నిధులతో అయీనాపూర్ గ్రామం నుంచి సుగూర్ లింగంపల్లి గ్రామం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఆర్ అండ్ బీ (R&B) రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు, గిరి అన్న గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కృష్ణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ గౌడ గారి ఆధ్వర్యంలో రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంత ప్రజలు సరైన రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు, అత్యవసర వైద్య సేవలు, విద్యార్థుల ప్రయాణాలు, రైతుల వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.4 కోట్ల నిధులతో రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కావడం గ్రామాల అభివృద్ధికి కీలక ముందడుగుగా నిలవనుంది.
ఈ రహదారి నిర్మాణం పూర్తయితే రెండు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపార రంగాలకు ఎంతో మేలు చేకూరనుంది. గ్రామాల మధ్య అనుసంధానం మెరుగుపడి ప్రజలకు ప్రయాణ సౌకర్యం కలగడంతో పాటు ప్రాంత అభివృద్ధికి కొత్త మార్గం ఏర్పడనుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: అయీనాపూర్ సర్పంచ్ శరణ్య స్వామి, కృష్ణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ గౌడ, మండల ఉపాధ్యక్షులు నారాయణ, మండల ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, పల్లె సురేష్, కృష్ణ సర్పంచ్ నాగేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగప్ప, నాగేశ్వరరావు, నాగేందర్, తమ్మప్ప, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నాగప్ప, కృష్ణ మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బాగ్లి మహేష్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ప్రజల రహదారి సమస్యపై స్పందించి, రూ.4 కోట్ల నిధులు మంజూరు చేయించి నిర్మాణ పనుల ప్రారంభానికి కృషి చేసిన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి కృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యం.. గ్రామాల అభివృద్ధే ధ్యేయం.. ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే సంకల్పం

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *