Saturday, 20 June 2026
  • Home  
  • “రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన యాచారం మండల కాంగ్రెస్ నాయకులు”
- News

“రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన యాచారం మండల కాంగ్రెస్ నాయకులు”

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన యాచారం మండల కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ – కాంగ్రెస్ శ్రేణుల సేవా కార్యక్రమం యాచారం, జూన్ 19: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను యాచారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోటె శ్రీశైలం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి, రోగులకు పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మోటె శ్రీశైలం మాట్లాడుతూ, మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ మరియు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన గొప్ప కుటుంబ వారసుడిగా రాహుల్ గాంధీ ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజా సమస్యలపై నిరంతరం గళం వినిపిస్తున్న రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ని చూడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాశం జయప్రకాష్, మేడిపల్లి నక్కర్త ఉప సర్పంచ్ దెంది మధూకర్ రెడ్డి, సీనియర్ నాయకులు గౌరారం వెంకట్ రెడ్డి, చీర శేఖర్, సంగెం మల్లేశ్, మల్కీజ్‌గూడ వార్డు సభ్యులు చీర మహేష్, బోడ మధు, రెడ్డి వెంకట్ రెడ్డి, కేశమోని బుచ్చయ్య, వరికుప్పల యాదయ్య, బోడ రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎరుకలి చింటు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలను అందుకుంది. “రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన యాచారం మండల కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ – కాంగ్రెస్ శ్రేణుల సేవా కార్యక్రమం

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన యాచారం మండల కాంగ్రెస్ నాయకులు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ – కాంగ్రెస్ శ్రేణుల సేవా కార్యక్రమం

యాచారం, జూన్ 19: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను యాచారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోటె శ్రీశైలం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి, రోగులకు పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మోటె శ్రీశైలం మాట్లాడుతూ, మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ మరియు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన గొప్ప కుటుంబ వారసుడిగా రాహుల్ గాంధీ ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజా సమస్యలపై నిరంతరం గళం వినిపిస్తున్న రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ని చూడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాశం జయప్రకాష్, మేడిపల్లి నక్కర్త ఉప సర్పంచ్ దెంది మధూకర్ రెడ్డి, సీనియర్ నాయకులు గౌరారం వెంకట్ రెడ్డి, చీర శేఖర్, సంగెం మల్లేశ్, మల్కీజ్‌గూడ వార్డు సభ్యులు చీర మహేష్, బోడ మధు, రెడ్డి వెంకట్ రెడ్డి, కేశమోని బుచ్చయ్య, వరికుప్పల యాదయ్య, బోడ రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎరుకలి చింటు తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలను అందుకుంది.
“రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన యాచారం మండల కాంగ్రెస్ నాయకులు
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ – కాంగ్రెస్ శ్రేణుల సేవా కార్యక్రమం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.