Saturday, 20 June 2026
  • Home  
  • రాష్ట్రస్థాయికి ఎదిగిన కోలా ఆనంద్ రాజకీయ ప్రస్థానం అభినందనీయం-పేట బ్రదర్స్
- తిరుపతి

రాష్ట్రస్థాయికి ఎదిగిన కోలా ఆనంద్ రాజకీయ ప్రస్థానం అభినందనీయం-పేట బ్రదర్స్

శ్రీ కాళహస్తి, జూన్ 20, (పున్నమి న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ కుమార్ జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తిలో ఘనంగా జరిగాయి. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్రబృందం కోలా ఆనంద్ కుమార్ నివాసానికి తరలివచ్చి ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పేట బ్రదర్స్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయి నుంచి తన అంకితభావంతో, నిరంతర ప్రజాసేవతో రాష్ట్ర స్థాయి నాయకుడిగా కోలా ఆనంద్ ఎదగడం ఎంతో సంతోషదాయకమని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నతమైన రాజకీయ స్థానాలను అధిరోహిస్తారనే నమ్మకం తమకుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు కోలా ఆనంద్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.