వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు: మండలంలోని రాచవారిపల్లి, జంగాలపల్లి గ్రామాల్లో జడ్పీటీసీ అభ్యర్థి కంభం విజయరామిరెడ్డి కూటమి నాయకులతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- ఈ సందర్భంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను జడ్పీటీసీగా, ఎంపీటీసీ అభ్యర్థి పోలు మాల్యాద్రి రెడ్డిని ఎంపీటీసీగా అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
- కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
దుత్తలూరు: మండలంలోని రాచవారిపల్లి, జంగాలపల్లి గ్రామాల్లో జడ్పీటీసీ అభ్యర్థి కంభం విజయరామిరెడ్డి కూటమి నాయకులతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను జడ్పీటీసీగా, ఎంపీటీసీ అభ్యర్థి పోలు మాల్యాద్రి రెడ్డిని ఎంపీటీసీగా అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.