Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యోగాతో ఆరోగ్యకరమైన జీవనశైలి – ఆర్టీసీ ఉద్యోగులకు అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
యోగాతో ఆరోగ్యకరమైన జీవనశైలి – ఆర్టీసీ ఉద్యోగులకు అవగాహన

ఉదయగిరి: ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చని డిపో మేనేజర్ రమేష్ కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక ఆర్టీసీ డిపోలో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా విధుల్లో ఉన్న ఉద్యోగులతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన, పర్యావరణహిత జీవనశైలి ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఉద్యోగులకు యోగా కార్యక్రమం నిర్వహించి, ప్రతిరోజూ నడక, శారీరక వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సుమారు 10 మొక్కలు నాటారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సీఐ నాగభూషణం, నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

యోగాతో ఆరోగ్యకరమైన జీవనశైలి – ఆర్టీసీ ఉద్యోగులకు అవగాహన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *