Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జలదంకి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జలదంకి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు అల్లూరు మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈరోజు జలదంకి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

జలదంకి మండల పరిధిలోని కొత్తపేట, సోమరాజుపాడు, కిష్టాపాడు, బోయలపాడు గ్రామాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పురస్కరించుకుని ఆయన ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలను నేరుగా కలుసుకుని, జడ్పీటీసీ అభ్యర్థి దామెర్ల దేవదాస్, ఎంపీటీసీ అభ్యర్థి చేవూరు శశికళలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు .

జలదంకి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

జలదంకి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *