రాజన్న సిరిసిల్ల ,ముస్తాబాద్ జులై 24( పున్నమి ప్రతినిధి. )
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య రాజు నాయక్, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) మల్లారపు రేవతి, వార్డు సభ్యుడు నర్సింహా పాల్గొని ఎల్నినో పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాల్సిన ప్రత్యామ్నాయ పంటలపై వివరించారు. గ్రామానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో హాజరై పంటల నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు తెలుసుకున్నారు.


