Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి భక్తుల అనుభవాలు, మరియు సేవా కార్యక్రమాలు!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి భక్తుల అనుభవాలు, మరియు సేవా కార్యక్రమాలు!!!

వార్త ముఖ్యాంశాలు

  • *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు..* *సేవాతత్పరత..* రెండు సంవత్సరాల క్రితం దత్తదీక్ష ప్రారంభం అయ్యే వారం ముందు.."అతను నిన్న సాయంత్రం వచ్చాడు..రాత్రి మంటపం లోనే పడుకున్నాడు..ఉదయాన్నే లేచి బైటకు వెళ్లి స్నానం చేసి వచ్చి..మామూలు క్యూ లో వచ్చి హారతులు తీసుకున్నాడు..సమాధి దర్శనం…
  • అని మా సిబ్బంది అడిగారు..పిలువమని చెప్పాను..అతని వద్దకు వెళ్లి..పిలుచుకొని వచ్చారు..అతను దగ్గరకు రాగానే..కూర్చోమని చెప్పాను..నిలబడతాను అని సైగ చేసాడు.."మీ పేరేమిటి?" అన్నాను..కొద్దిసేపు మౌనంగా వుండి.."రాఘవ.." అన్నాడు.."నా గురించి అడిగారట..ఏదైనా మాట్లాడాలా.."?
  • అన్నాను.."మీకు సమయం ఉంటే...కొంచెం సేపు మాట్లాడతాను.." అన్నాడు.."పర్లేదు చెప్పండి.." అన్నాను..

*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు..*

*సేవాతత్పరత..*

రెండు సంవత్సరాల క్రితం దత్తదీక్ష ప్రారంభం అయ్యే వారం ముందు..”అతను నిన్న సాయంత్రం వచ్చాడు..రాత్రి మంటపం లోనే పడుకున్నాడు..ఉదయాన్నే లేచి బైటకు వెళ్లి స్నానం చేసి వచ్చి..మామూలు క్యూ లో వచ్చి హారతులు తీసుకున్నాడు..సమాధి దర్శనం కూడా అక్కడినుంచి చేసుకున్నాడు..మీ గురించి అడిగాడు..ఈరోజు వస్తారని చెప్పాము..ముందు మంటపం లో కూర్చుని స్వామివారి చరిత్ర చదువుకుంటున్నాడు..పిలవమంటారా..”? అని మా సిబ్బంది అడిగారు..పిలువమని చెప్పాను..అతని వద్దకు వెళ్లి..పిలుచుకొని వచ్చారు..అతను దగ్గరకు రాగానే..కూర్చోమని చెప్పాను..నిలబడతాను అని సైగ చేసాడు..”మీ పేరేమిటి?” అన్నాను..కొద్దిసేపు మౌనంగా వుండి..”రాఘవ..” అన్నాడు..”నా గురించి అడిగారట..ఏదైనా మాట్లాడాలా..”? అన్నాను..”మీకు సమయం ఉంటే…కొంచెం సేపు మాట్లాడతాను..” అన్నాడు..”పర్లేదు చెప్పండి..” అన్నాను..
“చాలా రోజుల నుంచీ నేను మిమ్మల్ని ఫేస్ బుక్ లో ఫాలో అవుతున్నానండీ..అంటే..మొట్టమొదటిసారి మీరు స్వామివారి చరిత్రను పోస్ట్ చేసిన నాటి నుంచీ..2016 నుండీ క్రమం తప్పకుండా చదువుతున్నాను..ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచాయి..నేను ఉండేది అనంతపురం దగ్గర..సంవత్సరం నుంచీ ఇక్కడకు రావాలని ప్రయత్నం చేస్తున్నాను..ఏరోజూ వీలుపడలేదు..ఏదో ఒక ఆటంకం వచ్చి..నా ప్రయాణం వాయిదా పడుతూ వస్తోంది..ఈసారి ఒక నిర్ణయం తీసుకొని బయలుదేరాను..ఏ ఆటంకమూ కలుగలేదు..అదేమిటో ఒక్క చోట కూడా నేను వేచి చూసే సమయం కూడా లేకుండా వెంట వెంటనే బస్సులు దొరికాయి..పామూరు వరకూ వచ్చాను..పామూరు లో విచారిస్తే..ఇక్కడకు నేరుగా బస్సులేదు..మీరు మాలకొండకు వెళ్లి అక్కడనుండి ఆటో లో వెళ్ళండి అని చెప్పారు..అదేమి చిత్రమో తెలీదు..ఒకాయన నా దగ్గరకు వచ్చి..”మొగిలిచెర్ల స్వామివారి మందిరానికి వెళ్ళాలా..రండి..నేను కూడా అక్కడికే వెళుతున్నాను..ఇద్దరం కలిసే వెళదాము అని నన్ను అడిగి..తన మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని ఇక్కడికి తీసుకొచ్చాడు..నన్ను ఈ మందిరం ముందు వదిలిపెట్టి..స్వామివారి కి బైట నుండే నమస్కారం చేసుకొని..వెళ్ళిపోయాడు..ఇన్నాళ్లకు స్వామివారు నన్ను తన దగ్గరకు పిలిపించుకున్నారు అని నాకు అనిపించింది..దేనికైనా సమయం రావాలి..మీతో నా ఈ అనుభవాన్ని చెప్పుకుందామని నిన్న మీ గురించి అడిగాను..” అన్నాడు..”నాకు వివాహం జరిగి ఆరేళ్ళు అయిందండీ..ఇంకా సంతానం లేదు..స్వామివారిని ఎన్నోమార్లు మనసులో వేడుకున్నాను..ఈసారి ఇక్కడ దర్శించుకొని..నా కోరిక తెలుపుకొని వెళ్లాలని అనుకున్నాను..నేను ఇక్కడ మూడు రోజులు వుంటానండీ..మీరు అనుమతి ఇస్తే..స్వామివారి చేసే సేవలో నాకూ కొంత అవకాశం ఇవ్వండి..” అన్నాడు..మా సిబ్బంది ని పిలిచి చెప్పాను..ఏదైనా పని ఉంటే అప్పగించండి..అని..వాళ్ళూ సరే అన్నారు..
రాఘవ మూడురోజులు స్వామివారి మందిరం లో వున్నాడు..తెల్లవారుజామున లేచి..స్నానం చేసి వచ్చి..పనివాళ్ళతో కలిసి స్వామివారి మందిరం శుభ్రం చేసేవాడు..పూజా సామాగ్రి ని కడిగి పెట్టేవాడు..ఇలా ఏదో ఒక సేవ చేసుకుంటూ గడిపాడు..మేము దత్తదీక్ష ల ఏర్పాట్లలో ఉన్నాము..”అయ్యా..నేను రేప్పొద్దున మా ఊరు వెళతాను..మళ్లీ రెండురోజుల్లో తిరిగి ఇక్కడికి వస్తాను..ఈసారి దత్తదీక్ష నేను కూడా తీసుకుంటాను..మా భార్యకు, తల్లిదండ్రులకు చెప్పుకొని వస్తాను..” అన్నాడు..సరే అన్నాను..ఊరెళ్లిపోయాడు..సరిగ్గా దత్తదీక్ష మొదలయ్యేనాడు..రాఘవ వచ్చాడు..దత్తదీక్ష తీసుకున్నాడు..”అయ్యా..మా ఇంట్లో చెప్పుకొని వచ్చాను..ఈ నలభైరోజులూ ఇక్కడే ఉంటాను..స్వామివారి సేవ చేసుకుంటాను..” అన్నాడు..అతని గురించి ఆలోచించడానికేమీ లేదు కనుక..సరే అన్నాను..ఆరోజు నుంచీ ఆ నలభై రోజులూ అతను మా సిబ్బంది తో కలిసి..స్వామివారి మందిరం లో అన్ని పనుల్లో పాలుపంచుకున్నారు..నిరంతరం దత్తనామ స్మరణ చేస్తూ..తనకు అప్పగించిన పని అత్యంత శ్రద్ధతో చేసేవాడు..దీక్షలో ఉన్న స్వాములకు రెండుపూటలా ఆహార ఏర్పాటు చూసి..రెండు సోమవారాలు తాను ఆ ఖర్చు భరించాడు..
స్వామివారి ఆరాధన రోజు అగ్నిగుండం త్రొక్కి వచ్చి..”అయ్యా..దత్తుడి కృపతో దీక్ష పూర్తి చేసాను..మీరు మాల తీస్తే..దీక్ష విరమణ చేస్తాను..” అన్నాడు..అతని మెడలో వేసిన దీక్ష మాలలు తీసి..అతని చేతికి ఇచ్చాను..భక్తిగా కళ్లకద్దుకొని..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..నమస్కారం చేసుకొని వచ్చాడు..ఆరోజే తన ఊరికి వెళ్ళిపోయాడు..మరో నాలుగు నెలల తరువాత..రాఘవ మళ్లీ స్వామివారి మందిరానికి తన భార్యతో కలిసి వచ్చాడు..”అయ్యా..ప్రతి సంవత్సరం నేను దీక్ష తీసుకుంటాను..స్వామివారు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చారు..నా భార్య ఇప్పుడు గర్భవతి..ఒక్కసారి స్వామివారి సమాధి ని ఇద్దరమూ దర్శించుకొని వెళతాము..” అన్నాడు..”నీలోని సేవాతత్పరత..భక్తి..స్వామివారు గమనించి నిన్ను ఇక్కడికి పిలిపించుకున్నారు..నీ కోరికా తీర్చారు..” అన్నాను..
ఈసారి కూడా దత్తదీక్ష కు తాను వస్తున్నట్టు రాఘవ తెలిపాడు..దీక్ష సమయం లో రెండు సోమవారాలు తాను అన్నప్రసాదం ఏర్పాటు చేస్తానని..ఆ అవకాశం తనకు కల్పించమని కోరాడు..”సోమవారమే ఎందుకు?..ఏదైనా విశేషమా?..” అని అడిగాను..”మా ఇలవేలుపు ఈశ్వరుడు..ఆయన ప్రీతి కొరకు..సోమవారం నాడు అన్నదానం చేయాలని నా సంకల్పం..” అన్నాడు..
నిజానికి అతనికి స్వామివారు అన్నివిధాలా అనుమతి ఇచ్చి వున్నారు..మా అనుమతి కేవలం లాంఛనప్రాయం..రాఘవ లోని సేవాభావం..భక్తి..వినయం..ఈ మూడు గుణాలు..అతనిని స్వామివారి కృపకు పాత్రుడు అయ్యే విధంగా చేశాయి..ఆ సుగుణాలు మనలో ఉంటే..మనపై కూడా స్వామివారి కృప ప్రసరిస్తుంది..

సర్వం..
శ్రీ దత్తకృప!

*శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద ఏర్పాట్లు కొఱకు సంప్రదించవలసిన
మొబైల్ నెంబర్* : *పవని కృష్ణ కిరీటి* : *72078 75712

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

Leave a comment

Your email address will not be published. Required fields are marked *