Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

AP లో 4,5 తేదీల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం!!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
AP లో 4,5 తేదీల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం!!!!

వార్త ముఖ్యాంశాలు

  • *ఏపీలో 4,5 తేదీల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం..* *ఉత్తర్వులు జారీ* ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది.
  • ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వంతు వచ్చింది.
  • ఈ నెల 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు.ఈ ఎన్నికల కారణంగా ఉద్యోగులకు ఈనెల 4, 5 తేదీల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

*ఏపీలో 4,5 తేదీల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం..*

*ఉత్తర్వులు జారీ*

ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వంతు వచ్చింది. ఈ నెల 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు.ఈ ఎన్నికల కారణంగా ఉద్యోగులకు ఈనెల 4, 5 తేదీల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పోలింగ్‌ ఏర్పాట్ల కోసం బుధవారం..పోలింగ్‌కు సంబంధించి గురువారం సెలవుగా నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేశారు.అంతేకాదు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటిస్తారు.

అలాగే పరిషత్‌ పోలింగ్‌ రోజున ఉద్యోగులు, కార్మికులకు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. *నవంబర్ 5 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ కారణంగా ఆ ప్రాంతాల పరిధిలోని ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగులు, షాపుల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.* ఈ మేరకు ఈ సెలవుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. నవంబర్ 5నన పోలింగ్ రోజు మాత్రమే కాదు.. ఒక రోజు ముందు నవంబర్ 4న స్థానిక సెలవు ప్రకటించనున్నారు. పోలింగ్‌కు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తించనున్నాయి. వాస్తవానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న నిర్వహంచేందుకు షెడ్యూల్ ప్రకటించారు. కానీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడటంతో ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ తేదీని మార్చాల్సి వచ్చింది. ఈ నెల 5న పోలింగ్.. ఈ నెల 7న కౌంటింగ్ ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *